వందల కోట్లు కాజేశారు.. నారాయణ అక్రమాస్తులన్నీ త్వరలోనే బయటపడతాయి.. : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
Amaravati: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమనీ, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అలాగే, ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఏపీ సీఐడీ అరెస్టు పూర్తిగా సాక్ష్యాధారాల ఆధారంగానే జరిగిందనీ, అందుకే బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు నిరాకరించాయని ఆయన నొక్కి చెప్పారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు క్రమంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
AP Former Minister Anil Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమనీ, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తామన్నారు. ఇక ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఏపీ సీఐడీ అరెస్టు పూర్తిగా సాక్ష్యాధారాల ఆధారంగానే జరిగిందనీ, అందుకే బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు నిరాకరించాయని ఆయన నొక్కి చెప్పారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు క్రమంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
చంద్రబాబు, నారాయణ కలిసి వేల కోట్లు దోచుకున్నారని, పేదల భూములను నారాయణ కబ్జా చేశారని ఆరోపించారు. నిరుపేదలకు ఇవ్వాల్సిన రూ.800 కోట్ల విలువైన అసైన్డ్ భూములను నారాయణ దోచుకున్నారని ఆరోపించారు. నారాయణ అక్రమాలన్నీ త్వరలోనే బట్టబయలు అవుతాయని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. విచారణకు సహకరించవద్దని చంద్రబాబు, నారాయణ చర్చించారని, వారి చరిత్ర గురించి రాష్ట్ర ప్రజలు తెలుసునని విమర్శించారు. టీడీపీ నేతల నిరసనపై అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ఘటన టీడీపీ నేతలకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
అంతకుముందు, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చాలా స్కామ్ లు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు లక్కీ నంబర్ 23 అని, 2019 ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 23 మందిని లాక్కుని 23 సీట్లు గెలిచారని అనిల్ ఎద్దేవా చేశారు. ఇదే లక్కీ నెంబర్ అయిన 23వ తేదీన చంద్రబాబు అరెస్టు జరిగిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడితే వయసుతో సంబంధం లేకుండా చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అనిల్ స్పష్టం చేశారు. ఎలాంటి నేరమైన చట్టం దృష్టిలో నేరమేననీ, భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.