Asianet News TeluguAsianet News Telugu

కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు: కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ రైతుల కంప్లైంట్

కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న  ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీకి ఏపీకి చెందిన రైతు సంఘాల నేతలు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.

AP Farmers complaints against Telangana to KRMB
Author
hyderabad, First Published Feb 28, 2022, 4:41 PM IST


హైదరాబాద్: Krishna నదిపై Telangana నిర్మిస్తున్న ప్రాజెక్టులపై Andhra pradeshకి చెందిన రైతు సంఘాల నేతలు సోమవారం నాడు KRMB ఛైర్మెన్ కు ఫిర్యాదు చేశారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య  కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో  రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నాయి. అయితే తాజాగా ఏపీకి చెందిన రైతు సంఘాల నేతలు కేఆర్ఎంబీ ఛైర్మెన్ కు తెలంగాణ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త శ్రీనివాస్ ఈ విషయమై ఎన్టీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు కల్వకుర్తి తో పాటు ఇతర ప్రాజెక్టులపై కూడా ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 

Godavariనదిపై తెలంగాణ నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టులపై కూడా ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది. తెలంగాణ కూడా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా ఫిర్యాదులు చేసింది.

రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న నీటి వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, GRMBల పరిధిల్లోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే బోర్డుల పరిధిల్లోకి ప్రాజెక్టులను ఇచ్చే విషయమై తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ మాత్రం తాము సానుకూలంగా ఉన్నామని ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించిన తర్వాత తమ ప్రాజెక్టులను కూడా తీసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు బోర్డులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.

మరోవైపు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండా బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకు రావడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని కోరుతుంది. మరో వైపు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నది జలాల్లో గతంలో చేసిన కేటాయింపుల కంటే కొంత కోటాను పెంచాలని కూడా తెలంగాణ కోరుతుంది. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను కూడా వెనక్కి తీసుకొంది.

ఏపీ సీఎంగా Chandrababu ఉన్న సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ సమయంలో రెండు రాష్ట్రాల సీఎంలు, ఇరిగేషన్ శాఖల మంత్రులతో అప్పటి గవర్నర్ నరసింహాన్ చర్చించారు. ఆ తర్వాత  అప్పటి కేంద్ర జల్ శక్తి మంత్రి ఉమా భారతితో కూడా రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కూడా నీటి వివాాదాల విషయమై చర్చించారు.  ఈ సమావేశాల తర్వాత కూడా రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి.   తాజాగా ఏపీకి చెందిన రైతు సంఘాల నేతలు తెలంగాణపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయమై కేఆర్ఎంబీ ఛైర్మెన్ ఏ నిర్ణయం తీసుకొంటారోననేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios