గుంటూరు: భారత ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటూ ప్రధానిని కలిసే ముఖ్యమంత్రులను చూశాను గానీ ఫిర్యాదులు చేసేందుకే ఢిల్లీవెళ్లే సీఎంను జగన్ ను ఒక్కడినే చూస్తున్నానంటూ మండిపడ్డారు. 

ప్రధాని నరేంద్రమోదీని కలిస్తే నిధులు అడగాలిగానీ సీఎం జగన్ మాత్రం అభివృద్ధి, నిధులు వదిలేసి తనపై ఫిర్యాదులు చేశారని ఇది సరికాదంటూ చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం తప్పులు చేసిందని ఆరోపిస్తూ తనను అరెస్ట్ చేయాలంటూ  మోదీపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జగన్ చేశారంటూ విరుచుకుపడ్డారు. 

తాను ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని భావిస్తే ఆ అమరావతిలో ఏదో జరిగిందని పదేపదే మోదీ దగ్గర జగన్ ప్రస్తావించారంటూ ధ్వజమెత్తారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కలకలలాడినా రాజధాని అమరావతి నేడు వెలవెలబోతుందంటూ చెప్పుకొచ్చారు.  


తనపై కోపంతో అమరావతిని జగన్ చంపేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. తాను విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తే నేడు విమానాలన్నీ ఆగిపోయిన పరిస్థితి అంటూ స్పష్టం చేశారు.  

మరోవైపు తనకు ఇచ్చే సెక్యూరిటీతో కూడా జగన్ ఆటలాడుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. 20 ఏళ్ల పాలనలో తాము ఇలా చేస్తే మీరు ఉండేవాళ్లా అంటూ జగన్ ను నిలదీశారు చంద్రబాబు. 

ఈ వార్తలు కూడా చదవండి

పాలు ఇచ్చే ఆవును కాదని దున్నను తెచ్చుకున్నారు : ఓటమిపై చంద్రబాబు