Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా ఉద్యోగుల ఛలో తెలంగాణ: కేసీఆర్ కు షాకిస్తారా..?

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏపీకి చెందిన ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయ్యాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ ఉద్యోగులు తెలంగాణలో ఉద్యోగం విధులు నిర్వహించారు. 
 

ap employees are intrested to vote in telangana
Author
Amaravathi, First Published Nov 27, 2018, 7:07 PM IST

అమరావతి: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏపీకి చెందిన ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయ్యాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ ఉద్యోగులు తెలంగాణలో ఉద్యోగం విధులు నిర్వహించారు. 

రాష్ట్ర విభజనలో భాగంగా ఉద్యోగులు ఏపీకి కేటాయించబడినా ఓటు హక్కు మాత్రం తెలంగాణలోనే ఉంది. అయితే రసవత్తంగా సాగుతున్న తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి డిసెంబర్‌ 7న సెలవు కావాలంటూ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

అదే విధంగా అన్నిఆఫీసులకు వచ్చే నెల 7ను అధికారిక సెలవుగా పరిగణించాలని సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికీ ఏపీలో పనిచేస్తున్న సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులకు హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉందని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ కు వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios