Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఇంటర్ ఫలితాలు లేట్: ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల కావాల్సిన ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 

AP EAM CET 2019 results postponed
Author
Amaravathi, First Published May 16, 2019, 7:54 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల కావాల్సిన ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

ఫలితాల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణలో ఫెయిలైన ఇంటర్ విద్యార్ధుల రీవాల్యుయేషన్ ఫలితాల తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలకు 2,82,901 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలకు 81,916 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios