ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఎవరైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక చూసుకుని మాట్లాడాలి. ఏమాత్రం నోరు జారినా సోషల్ మీడియాలో జనాలు ట్రోల్ చేస్తారు. గతంలో నారా లోకేశ్ ఇలాగే మాట్లాడి ఎన్నోసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లోకి ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి చేరారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సొంత జిల్లాకు వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడుతూ తడబడ్డారు.

ముఖ్యమంత్రి ఒకటే లైన్‌తో వెళుతున్నారు.. అవినీతి పరిపాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయమని శ్రీవాణి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని గమనించని నేతలు ఆమెను అప్రమత్తం చేయడంతో ఆమె ఆ తర్వాత సరిగ్గా మాట్లాడినట్లు తెలుస్తోంది.

దీంతో ఆమెపై తెలుగుదేశం పార్టీ ట్రోలింగ్ మొదలెట్టేసింది. ‘‘మీ లక్ష్యం ఏంటో స్వయంగా సెలవిచ్చినందుకు ధన్యవాదాలు మేడం.. మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామంటూ ట్వీట్ చేసింది.