ఒంగోలు: ప్రకాశం జిల్లాలో  మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్‌పై  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామన్నారు.రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపే స్పందించి నిందితులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను ప్రశంసించారు.

ఈ నెల 17 నుండి 22వ తేదీ వరకు మైనర్ బాలికపై ఆరుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడి కోసం వచ్చిన బాలికను నమ్మించి ఆరుగురు నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.