Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు.. ఆ రెండు పత్రికలకు.. డీజీపీ లీగల్ నోటీసులు...

అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు, తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు,, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

ap dgp gautam sawang legal notice to chandrababu naidu, lokesh and tdp leaders
Author
Hyderabad, First Published Oct 13, 2021, 8:02 AM IST

అమరావతి :  కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) గుజరాత్ లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ తో ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేకున్నా, అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు, తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు,, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

నిరాధార ఆరోపణలతో కథనాలు…
‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ రవాణా-  గుజరాత్ లో పట్టుబడ్డ హెరాయిన్  సీఎం ఇంటి సమీపంలో సంస్థలదే’, ‘ దీనికి సీఎం, డిజిపి ఏమని సమాధానం చెబుతారు?’,  ‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై డిజిపి అవాస్తవాలు’  అనే శీర్షికలతో ఈనాడు పలు కథనాలను ప్రచురించింది.  ‘జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి’, ‘డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్,  డిజిపి ఏం చెబుతారు?’, ‘చంద్రబాబు ధ్వజం’ అనే శీర్షికలతో ఆంధ్రజ్యోతి వార్తలు  ప్రచురించింది. 

నిరాధారమైన ఆరోపణలు చేయడం,  వాటిని ప్రచురించడంపై  chandrababu, lokesh లోకేష్, దూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బోండా ఉమా, బుద్ధా వెంకన్న,   కొమ్మా రెడ్డి పట్టాభి, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు,  ఆయన కుమారుడు,  eenadu ఎండీ సీహెచ్ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్,  ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు,  ఆ పత్రిక బ్యూరో చీఫ్ తో పాటు... andhrajyothi ఎండీ వేమూరి రాధాకృష్ణ,  ఆమోద పబ్లికేషన్స్,  ప్రింటర్-పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, ఆ పత్రిక బ్యూరో చీఫ్ లకు టీడీపీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి 
Legal noticeలు ఇచ్చారు.

ఆత్మహత్యలొద్దు... మీ కోసం జగన్ సర్కార్ తో పోరాడతాం: కాంట్రాక్టర్లకు చంద్రబాబు భరోసా

దురుద్దేశపూర్వకంగా...
DRI గుజరాత్ లో స్వాధీనం చేసుకున్న రూ. 21 వేల కోట్ల విలువైన heroin drugsతో ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ  చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు ప్రభుత్వ ప్రతిష్ఠకు కలిగించడంతో పాటు Police Department  నైతిక స్థైర్యాన్ని  దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదని ప్రకటించిన స్పష్టత ఇచ్చిన దురుద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.

ఆ నిరాధార ఆరోపణల పై వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించి, పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించాయని అన్నారు.  దురుద్దేశపూరిత చర్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.  చంద్రబాబు, లోకేష్,టిడిపి నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆయా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో వారిపై డిజిపి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios