డీఎస్పీ ప్రమోషన్లలో నిబంధనలు ప్రకారమే ముందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అనుమానం వస్తే తనను నేరుగా కలవొచ్చని స్పష్టం చేశారు. సీనియారిటీ ప్రకారమే తాము ప్రమోషన్లు ఇచ్చామని అందులో ఎలాంటి పక్షపాతం లేదన్నారు.  

అమరావతి: వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో కౌంటర్ ఇచ్చారు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఒకేసారి 4,377 మందికి పదోన్నతులు కల్పించినట్లు స్పష్టం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

డీఎస్పీ ప్రమోషన్లలో నిబంధనలు ప్రకారమే ముందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అనుమానం వస్తే తనను నేరుగా కలవొచ్చని స్పష్టం చేశారు. సీనియారిటీ ప్రకారమే తాము ప్రమోషన్లు ఇచ్చామని అందులో ఎలాంటి పక్షపాతం లేదన్నారు. 

అవసరమైతే సీనియారిటీ జాబితా వెబ్ సైట్ లో చూసుకోవచ్చునని హితవు పలికారు. అంతేకానీ ఏదో జరిగిందని, ఒకే కేస్ట్ వారికి ప్రమోషన్లు ఇచ్చామంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. అనుమానాలు ఉంటే నన్న సంప్రదించాలనని కోరారు డీజీపీ ఆర్పీ ఠాకూర్.