కోదాడ: ఏపీ డీప్యూటీ సీఎం నారాయణస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది.  కాన్వాయ్ లోని మరో వాహనం డీప్యూటీ సీఎం ప్రయాణీస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడ్డాడు.

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ డీప్యూటీ సీఎం విజయవాడ నుండి హైద్రాబాద్ వైపునకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

మంత్రి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో .. కాన్వాయ్ లో మంత్రి వెనుక వాహనం మంత్రి ప్రయాణీస్తున్న వాహానాన్ని ఢీకొట్టింది. సడన్ బ్రేక్ వేయడంతో స్పీడ్ గా ఉన్న వాహనాలను కంట్రోల్ కాలేదు. దీంతో చివరి నిమిషంలో ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో  మంత్రి వాహనాన్ని ఢీకొట్టింది.

డీప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ ప్రమాదం నుండి సురక్షితంగా తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.చిత్తూరు జిల్లాకు చెంందిన నారాయణస్వామి జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. జగన్ కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా కొనసాాగుతున్న విషయం తెలిసిందే.