అనిశ్చితి నెలకొంది, మేము పాల్గొనం: పవన్ లాంగ్ మార్చ్ కి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్


గతంలో కాంగ్రెస్ ఆందోళనలో పవన్ పాల్గొనలేదు కాబట్టి ప్రస్తుతం పవన్ చేస్తున్న ఇసుక లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు.  

అధ్యక్షుడి ఎంపిక కసరత్తులో భాగంగానే మాత్రమే పవన్ లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదని తులసిరెడ్డి స్పష్టం చేశారు. 
 

ap congress will not participated in pawan kalyan long march

విజయవాడ: జనసేనాని పవన్ కళ్యాణ్ కి మరోపార్టీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇసుక సంక్షోభంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం తలపెట్టిన లాంగ్ మార్చ్ కు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. పార్టీ కారణాల వల్ల పవన్ లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పింది. 

రాష్ట్ర కాంగ్రెస్ లో అనిశ్చితి నెలకొందని ఈ పరిణామాల నేపథ్యలో లాంగ్ మార్చ్ లో పాల్గొనడం సరికాదని భావిస్తున్నట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక సంక్షోభం నేపథ్యంలో జనసేన చేపట్టిన లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తనకు ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలిపారు. 

అయితే పార్టీలో అనిశ్చితి నెలకొందని తాను స్పష్టం చేశానని తెలిపారు. అయినప్పటికీ హాజరుకావాలని కోరడంతో పార్టీ లో నేతలతో చర్చించిచెప్తానని గుర్తు చేశారు. అయితే పవన్ లాంగ్ మార్చ్ పై పార్టీలో చర్చిచినట్లు తెలిపారు. 

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ లో పాల్గొనకూడదని పార్టీ నిర్ణయించడంతో పాల్గొనడం లేదని తెలిపారు. పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలోనే లాంగ్ మార్చ్ కు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. 

అయితే గతంలో కాంగ్రెస్ ఆందోళనలో పవన్ పాల్గొనలేదు కాబట్టి ప్రస్తుతం పవన్ చేస్తున్న ఇసుక లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు.  అధ్యక్షుడి ఎంపిక కసరత్తులో భాగంగానే మాత్రమే పవన్ లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదని తులసిరెడ్డి స్పష్టం చేశారు. 

ఇకపోతే శనివారం పవన్ కళ్యాణ్ కు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధులు స్వయంగా లేఖలు రాశారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. లాంగ్ మార్చ్ కి తమతోపాటు బీజేపీని కూడా ఆహ్వానించడంతో తాము దూరం కావాల్సి వస్తుందని తెలిపారు. 

ఇకపోతే పవన్ లాంగ్ మార్చ్ ఆహ్వానంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. తొలుత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వేదికను తాము పంచుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైతం పవన్ తో వేదికను పంచుకోబోమని తెలిపారు. 

అయితే శుక్రవారం కన్నా లక్ష్మీనారాయణ మాట మార్చారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు బీజేపీ సంఘీభావం తెలుపుతుందని తెలిపారు. అయితే విష్ణువర్థన్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. దాంతో బీజేపీ గందరగోళంలో పడింది. 

వాస్తవానికి గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. వామపక్ష పార్టీలకు సైతం కీలక సీట్లు కేటాయించారు. అయితే వారు కూడా పవన్ కళ్యాణ్ పోరాటానికి దూరంగా ఉండటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీ మాత్రమే పవన్ లాంగ్ మార్చ్ కి మద్దతు ప్రకటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో ముగ్గురు టీడీపీ నేతలు వేదిక పంచుకోనున్నారు. మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసులు లాంగ్ మార్చ్ లో పాల్గొంటారని పార్టీ తెలిపింది. 

అన్ని పార్టీలు తిరస్కరించి కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే మద్దతు ప్రకటించడంతో వైసీపీ నేతలు విమర్శల దాడి పెంచారు. మద్దతుతో మరోసారి టీడీపీ జనసేన ఒక్కటేనని రుజువైందంటూ టీడీపీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల

జనసేన లాంగ్ మార్చ్ కి బాబు టీం రెడీ: పవన్ తో అడుగేయనున్న ముగ్గురు మాజీమంత్రులు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios