Asianet News TeluguAsianet News Telugu

ఆక్సిజన్‌ అందక 11 మంది మరణించారు.. సప్లై పెంచండి : ప్రధాని మోడీకి జగన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఆక్సిజన్‌ కేటాయింపులు, సరఫరా, వ్యాక్సిన్ తదితర అంశాలపై ఆయన  లేఖలో ప్రస్తావించారు. ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజెన్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా జగన్ కోరారు. 

ap cm ys jaganmohan reddy letter to pm narendra modi for oxygen cylinders ksp
Author
amaravathi, First Published May 11, 2021, 5:37 PM IST

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఆక్సిజన్‌ కేటాయింపులు, సరఫరా, వ్యాక్సిన్ తదితర అంశాలపై ఆయన  లేఖలో ప్రస్తావించారు. ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజెన్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా జగన్ కోరారు.

ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నప్పటికీ అది ఏమాత్రం సరిపోవడం లేదని సీఎం ఆవేదన  వ్యక్తం చేశారు. 20 ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని జగన్ కోరారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేసుకుంటున్నామని సీఎం తెలిపారు.

ఈనెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్ ఆలస్యం కావడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న... 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 150 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Also Read:ఏపీలో కోవిడ్ ఉద్ధృతి: కొత్తగా 20,345 కేసులు.. చిత్తూరు, విశాఖలలో భయానకం

ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న...210 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 400 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరన్న జగన్... దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్న సంస్థ కోవాగ్జిన్‌ ఒక్కటేనని గుర్తుచేశారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి...ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు సహకరించాయని ముఖ్యమంత్రి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios