ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఉదయం హైదరాబాద్‌ రానున్నారు. అనంతరం పది పదే నిమిషాల్లో ఆయన విశాఖకు వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఉదయం హైదరాబాద్‌ రానున్నారు. రేపు ఉదయం 8.10కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం పది పదే నిమిషాల్లో ఆయన విశాఖకు వెళ్లనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ‌తో కలిసి జగన్ విశాఖకు వెళ్తారని ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. రేపు అదానీ డేటా సెంటర్ శంకుస్థాపనలో పాల్గొననున్న జగన్, అదానీ పాల్గొననున్నారు. జగన్ హైదరాబాద్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.