ఏప్రిల్ 3న ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యులతో వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దాదాపు ఏడాది కావొస్తున్నా కొందరు ఎమ్మెల్యేలు , ఇన్‌ఛార్జ్‌లు కనీసం ఒక్క సచివాలయాన్ని కూడా సందర్శించలేదు. వీరిపై జగన్ గుర్రుగా వున్నారు.  

ఏప్రిల్ 3న ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యులతో వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై పలుమార్లు మందలించినా నేతల్లో మార్పు రాకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి సీఎం సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఏడాది కావొస్తున్నా కొందరు ఎమ్మెల్యేలు , ఇన్‌ఛార్జ్‌లు కనీసం ఒక్క సచివాలయాన్ని కూడా సందర్శించలేదు. వీరిపై జగన్ గుర్రుగా వున్నారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి సంబంధించి ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంతో అధికార పార్టీ ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి కూడా బహిష్కరించింది. అయితే 40 నుంచి 50 మంది అభ్యర్ధులు తమతో టచ్‌లో వున్నారంటూ టీడీపీ నేతలు ప్రకటిస్తూ వుండటంతో అధికార పార్టీలో గుబులు రేగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య జగన్ సమీక్ష నిర్వహిస్తూ వుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.