అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు మధ్యాహ్నం బెంగుళూరుకు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి సీఎం బెంగుళూరు వెళ్తారు. ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు సీఎం బెంగుళూరులోని  తన నివాసానికి చేరుకొంటారు.

జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు వచ్చింది. దీంతో తన కుమార్తెను విదేశాలకు పంపేందుకు గాను ఆయన ఇవాళ బెంగుళూరుకు వెళ్లనున్నారు. ఫారిన్ క్యాంపస్ లో మాస్టర్స్ డిగ్రీ చదవనున్న హర్షారెడ్డి. ఈ నెల 27వ తేదీన సీఎం జగన్ తాడేపల్లికి తిరిగి రానున్నారు.

స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత సీఎం జగన్ బెంగుళూరుకు వెళ్లనున్నారు. హర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పారిస్ లో మాస్టర్స్ ను ఇన్సీడ్ యూనివర్శిటీలో పూర్తి చేయనున్నారు.ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో హర్షారెడ్డికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు దక్కింది.