Asianet News TeluguAsianet News Telugu

AP CM Jagan Delhi Visit: రేపు ఢిల్లీకి జగన్, ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 25వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.మావోయిస్టు ప్రబావిత ప్రాంతాల సీఎంల సమావేశంలో పాల్గొనేందుకు జగన్ ఢిల్లీ వెళ్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

AP CM YS Jagan to leave for delhi on september 25
Author
Guntur, First Published Sep 24, 2021, 12:20 PM IST

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్  (Andhra pradesh CM YS Jagan Delhi visit)ఈ నెల 25వ తేదీనే ఢిల్లీకి(Delhi) వెళ్లనున్నారు. మావోయిస్టు (maoist) ప్రభావిత సీఎంల సమావేశంలో పాల్గొనేందుకు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.

ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం ఏపీ సీఎం వైఎస్ జగన్  ఢిల్లీ టూర్ కి వెళ్తారు. గన్నవరం (Gannavaram)నుండి నేరుగా ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఎల్లుండి ఏపీ మావోయిస్టు ప్రభావిత సీఎంల సమావేశంలో  జగన్ పాల్గొంటారు.ఇవాళ సాయంత్రమే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ (Telangana cm Delhi visit) వెళ్లనన్నారు.

మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే గడుపుతారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో కేసీఆర్ భేటీ కానున్నారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో  పలు కేంద్ర మంత్రులను కూడ కలిసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios