వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ప్రపంచ కంటి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, వైద్య సేవలు, కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయనున్నారు.

ఈ పథకం మొత్తం మూడేళ్ల పాటు అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం ఐదు దశల్లో అమలయ్యే ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. కాగా ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన అనంతపురం బయల్దేరనున్నారు.