వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు మోడీతో భేటీ కానున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని మోడీని జగన్‌ను కోరనున్నారు. అనంతరం ఈ నెల 15న జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొని..ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆర్థిక లోటుపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తారు.