Asianet News TeluguAsianet News Telugu

ఇకపై ప్రతి ఎమ్మెల్యేకూ ఒక ఐప్యాక్ ప్రతినిధి.. వారసులకు నో టికెట్స్ : తేల్చేసిన జగన్

గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో భాగంగా సీఎం జగన్ సీనియర్లకు గట్టి హెచ్చరికలు పంపారు. పనితీరు మార్చుకోకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అక్టోబర్ 15 నుంచి ప్రతీ ఎమ్మెల్యేకు ఒక ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేస్తానని సీఎం పేర్కొన్నారు

ap cm ys jagan serious on ysrcp mlas at workshop on gadapa gadapaku mana prabhutvam
Author
First Published Sep 28, 2022, 7:56 PM IST

గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో 27 మందికి క్లాస్ పీకారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కొందరు మంత్రులు , ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన ఆయన ఐదుగురు రీజనల్ కో ఆర్డినేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాలని లేదంటే పదవులకు రాజీనామా చేసి తప్పుకోవాలని తేల్చిచెప్పారు జగన్. అక్టోబర్ 15 నుంచి ప్రతీ ఎమ్మెల్యేకు ఒక ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేస్తానని సీఎం పేర్కొన్నారు. అటు జగన్ క్లాస్ తీసుకున్న వారిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తానేటి వనిత, రోజా , కారుమూరి నాగేశ్వరరావులు వున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని, కొడాలి నానికి ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గ్రంథి శ్రీనివాస్, శిల్పా చక్రపాణి, చిర్ల జగ్గిరెడ్డి, కోడుమూరి శ్రీనివాసులు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు జగన్. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంకా యాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. సీఎం క్లాస్ తీసుకున్న వారిలో మంత్రులు , మాజీ మంత్రులే ఎక్కువగా వున్నారు. 

ALso REad:తీరు మార్చుకోండి , 27 మంది ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ .. లిస్ట్‌లో బుగ్గన, తానేటి వనిత, బాలినేని...?

అసెంబ్లీ ఎన్నికలకు 19 నెలల సమయం వుందని పదేపదే గుర్తుచేశారు జగన్. మీరంతా నాతో పాటు నా చేయి పట్టుకుని నడిచినవారేనని జగన్ పేర్కొన్నారు. పనితీరు మెరుగు పర్చుకోవాలని సీఎం ఆదేశించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్ధుల మార్పు వుంటుందని జగన్ వెల్లడించారు. పనితీరు బాగోని నేతలను మారుస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. వారసులకు టికెట్లు ఇచ్చే అంశంపై జగన్ స్పందించారు. 

వచ్చే ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని వారసులకు టికెట్లు లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మళ్లీ మీ ఇద్దరూ తనతో కలిసి పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్లాలని జగన్ వారిద్దరికి సూచించారు. గంట, రెండు గంటలు గ్రామాల్లో తిరిగితే లాభం లేదని సీఎం పేర్కొన్నారు. 7 నుంచి 8 గంటలు గ్రామాల్లో తిరగాలని జగన్ ఆదేశించారు. మళ్లీ డిసెంబర్‌లో సమీక్ష నిర్వహిస్తానని సీఎం పేర్కొన్నారు. అప్పటికీ అందరూ బాగా పనిచేయాలని... మళ్లీ పేర్లు చదవాల్సిన అవసరం రాకూడదని సీఎం వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని జగన్ వ్యాఖ్యానించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios