కరువుకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్: ఏపీ అసెంబ్లీ సీఎం జగన్ సెటైర్లు
ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రాన్ని, పేద ప్రజలను సర్వనాశనం చేసిన ఉదంతాలు చంద్రబాబు చరిత్రలో అనేకం ఉన్నాయన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కరువు వెంటాడుతుందన్నారు.
అమరావతి: కరువుకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు వేశారు.. సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో పారిశ్రామిక ప్రగతిపై జరిగిన చర్చలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రజలు బాగుంటే చంద్రబాబుకు బాధగా ఉంటుందన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని సీఎం విమర్శించారు.
రాష్ట్రానికి మంచి జరిగితే చంద్రబాబు ఓర్వలేడన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే చంద్రబాబు ఏడుస్తారన్నారు.రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకొనేందుకు ఒక్క విషయం కూడా లేదన్నారు. కానీ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబునాయుడు ఏం చేశాడో చెప్పేందుకు అనేక ఉదహరణలున్నాయని సీఎం చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రజలకు మేలు చేయలేదని సీఎం జగన్ విమర్శించారు.
వ్యవసాయం దండుగ అనడంతో పాటు రైతులను మోసం చేశాడని ఎవరిని అడిగినా చంద్రబాబు పేరే చెబుతున్నారన్నారు. పల్లెలను దెబ్బతీసిన చరిత్ర కూడా చంద్రబాబుదేనని సీఎం జగన్ చెప్పారు. కరువు కు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబేనని సీఎం జగన్ సెటైర్లు వేశారు. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను మోసాలుగా మార్చింది ఎవరని అడిగితే చంద్రబాబు పేరే చెబుతారని సీఎం జగన్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చంద్రబాబు ప్రథమ శతృవుగా జగన్ పేర్కొన్నారు.
also read:మూడేళ్లలో 6.16 లక్షల మందికి ఉద్యోగాలు: ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్
రాష్ట్రాన్ని విడగొట్టడానికి తొలి ఓటు వేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రాకుండా చేసింది కూడా చంద్రబాబే అని ఆయన విమర్శించారు. పోలవరం కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను వదులుకొని ప్రత్యేక ప్యాకేజీని తీసుకున్నారని చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఆయన దుష్టచతుష్టయం మనల్ని చూసి ఏడుస్తున్నారన్నారు.