Asianet News TeluguAsianet News Telugu

మాంసం తినే పులి మారుతుందా?: ముసలి పులితో బాబును పోలుస్తూ జగన్ సెటైర్లు


టీడీపీ చీఫ్ చంద్రబాబుపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  విమర్శలు గుప్పించారు. అనంతపురంలో  జగనన్న వసతి దీవెన పథకం  నిధుల విడుదల తర్వాత  బాబుపై  సెటైర్లు వేశారు.  
 

AP CM YS Jagan  Satirical Comments  On  TDP Chandrababu naidu   in Anantapur lns
Author
First Published Apr 26, 2023, 1:16 PM IST

అనంతపురం: నరమాంసం  తినే పులి మారిందంటే నమ్ముతామా? అలానే చంద్రబాబు మారారాంటే నమ్ముతామా అని  ఏపీ   జగన్ ప్రశ్నించారు. 

అనంతపురం  జిల్లా నార్పలలో  జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్ధుల తల్లిదండ్రుల ఖాతాల్లో  సీఎం జగన్  విడుదల  చేశారు. ఈ సందర్భంగా  నిర్వహించిన  సభలో  చంద్రబాబుపై  జగన్  విమర్శలు గుప్పించారు.  ఇటీవలనే రిపబ్లిక్ టీవీకి  చంద్రబాబు  ఇంటర్వ్యూ ఇచ్చాడర్నారు. 
 వచ్చీరాని ఇంగ్లీష్ లో  ఆ ఇంటర్వ్యూను చంద్రబాబు  ఇచ్చారని   జగన్  సెటైర్లు వేశారు.  

చంద్రబాబు  ఇంటర్వ్యూపై  పంచతంత్రం  కథను  జగన్ గుర్తు  చేశారు.  వేటాడే శక్తిని  కోల్పోయిన  పులి  గుంటనక్కలను  వెంటేసుకొందన్నారు.  మాయా మాటలు  చెప్పి  నీటి గుంట  వద్దకు  వచ్చినవారిని  ఆ పులి  చంపి తినేదని  జగన్  చెప్పారు. పంచతంత్రం కథలోని పులిని  చంద్రబాబుతో  జగన్ పోల్చారు.  ఆ పులి అడవిలో తనకు  40 ఏళ్ల ఇండస్ట్రీ అని  చెప్పుకుంటుందని చంద్రబాబుపై  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. . ఈ కథ వింటే   చంద్రబాబు నాయుడు  గుర్తుకు వస్తారని  సీఎం తెలిపారు.  

పంచతంత్రం  కథలోని  ముసలి పులి లాంటి వాడు చంద్రబాబు అని  సీఎం  చెప్పారు..  బంగారం కడియం  ఆశచూపి  మనుషులను  మింగేసే పులి బాపతు వె8న్నుపోటు  పొడిచే తత్వం చంద్రబాబుదని  జగన్ విమర్శలు చేశారు. అబద్దాలు  ఎప్పటికీ  చెప్పే  ఘటికుడు  చంద్రబాబు అని  జగన్ విమర్శించారు. మాయామాటలు  చెప్పే చంద్రబాబు లాంటి వారిని  నమ్మకూడదని  జగన్  ప్రజలను  కోరారు.  

అబద్దాలు చెప్పేవారిని, వెన్నుపోటు  పొడిచేవారిని  ఎట్టి పరిస్థితుల్లో  నమ్మకూడదని  సీఎం  జగన్  చెప్పారు.   తాను సీనియర్ ను, ఇప్పుడు మంచోడిని అయ్యానని నమ్మించే ప్రయత్నం  చేస్తున్నారని  చంద్రబాబుపై  జగన్  విమర్శలు గుప్పించారు. 2014లో  పంట రుణమాఫీ  చేస్తానని  రైతులను  మోసం చేశాడర్నారు. మళ్లీ మోసం  చేసేందుకు  చంద్రబాబు  వస్తున్నాడన్నారు.  దోచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు సిద్దాంతంగా  జగన్  పేర్కొన్నారు. 

చంద్రబాబుకు  తోడుగా  గజదొంగల ముఠా ఉందన్నారు.  ఎల్లో మీడియా,  పవన్ కళ్యాణ్  బాబుకు తోడుగా  ఉన్నారని  జగన్  తెలిపారు. చంద్రబాబు అబద్దాలను , మోసాలను  చూసి నమ్మవద్దని  సీఎం  కోరారు.  జగనన్నతో  మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో చూడాలని  ఈయన  ప్రజలను  కోరారు.  తన నమ్మకం,  ఆత్మవిశ్వాసం  మీరేనని  జగన్  ప్రజలనుద్దేశించి  వ్యాఖ్యానించారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios