రాష్ట్రంలోని సగం మార్కెట్ ఛైర్మన్ల పదవులు మహిళలకే కేటాయిస్తామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మార్కెటింగ్, సహకార శాఖలపై గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ చివరి నాటికి అన్ని మార్కెట్ కమిటీలను నియమిస్తామన్నారు. ఆరు నెలల్లో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని జగన్ అధికారులను ఆదేశించారు.

కనీస మద్ధతు ధరలు లేని పంటలకు ధరలు ప్రకటించాలని..అక్టోబర్ చివరి నాటికి చిరుధాన్యాలపై బోర్డును ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలపై కమిటీని ఏర్పాటు చేస్తామని సహకార బ్యాంకుల పునర్‌వ్యవస్థీకరణ బలోపేతంపై ప్రతిష్టాత్మక సంస్థతో అధ్యయనం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.