సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య రక్ష.. విధి విధానాలు ఇలా, అధికారులకు జగన్ ఆదేశాలు
సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించాలని.. రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్నారు.

సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంప్ నిర్వహించాలని.. ప్రతి ఇంట్లోనూ వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలని జగన్ సూచించారు.
గ్రామంలో ఓ రోజున హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని.. ఈ సందర్భంగా అవసరమైన పరీక్షలు చేయడంతో పాటు మందులు, కళ్లద్దాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామంలో ఆరోగ్య సమస్యలుంటే.. ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారని సీఎం జగన్ తెలిపారు. ఓ వైపు తనిఖీలు చేస్తూనే మందులు కూడా ఇస్తామని.. దీనికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Also Read: దోచుకోవడానికే స్కీమ్ .. రూపాయి రాలేదని సీమెన్స్ చెప్పింది, పక్కా ఆధారాలతోనే అరెస్ట్ : సజ్జల
ఈ కార్యక్రమంలో ప్రతి ఇల్లు కవర్ చేయాలని.. క్రానిక్ రోగులు వున్న ఇళ్లను మరింత ప్రత్యేకంగా చూడాలని జగన్ సూచించారు. గర్భవతులు, బాలింతలతో పాటు రక్తహీనత వున్న వారిని కూడా గుర్తించాలని సీఎం కోరారు. దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్ కేసులు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా చికిత్స అందించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశంచారు. ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించాలని.. రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్నారు.