అగ్రిగోల్డ్‌ స్కామ్‌కి చంద్రబాబు సర్కారే కారణం: వైఎస్ జగన్

అగ్రిగోల్డ్ బాధితుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం ఈ స్కామ్ కి శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. 

AP CM YS Jagan releases funds to Agri gold scam victims

అమరావతి:  గత ప్రభుత్వమే కర్త, కర్మ, క్రియగా అగ్రిగోల్డ్ స్కాం జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు మంగళవారం నాడు డబ్బులను జమ చేసింది.  రూ10 వేలు, రూ. 20 వేల లోపు డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించింది.  ఇవాళ ఏడు లక్షల మంది బాధితులకు ప్రభుత్వం నిధులను జమ చేసింది.

ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడారు.కష్టపడి పేదలు దాచుకొన్న డబ్బును దోచుకొన్నారన్నారు. అగ్రిగోల్డ్‌లో ఉన్న డబ్బంతా పేద ప్రజలదేనని ఆయన చెప్పారు.

గతప్రభుత్వంలోని వ్యక్తుల కోసం ఈ మోసం జరిగిందని  ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను గాలికి వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మకైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు బాధితులను మోసం చేసిందన్నారు సీఎం జగన్,. పేద ప్రజలు నష్టపోకుండా తమ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందన్నారు. 

ఓ ప్రైవే్ కంపెనీ మోసం చేసిన ఎగ్గొట్టిన డబ్బును ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవని సీఎం జగన్ చెప్పారు.పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతను తీసుకొందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అగ్రి గోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు.2019 నవంబర్ లోనే 3.40 లక్షల మందికి రూ., 238 కోట్లను చెల్లించినట్టుగా జగన్ గుర్తు చేశారు.   10 లక్షల 45 వేల కుటుంబాలకు రూ.905.57 కోోట్లు జమ చేస్తున్నామన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios