ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని పాదయాత్రలో ప్రకటించిన జగన్..  ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు.

దీనిలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు విధి విధానాలపై అధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశం కానున్నారు. జిల్లాల పునర్విభజన ప్రారంభమైతే ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామనే ధీమాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.