Asianet News TeluguAsianet News Telugu

గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీని సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలి: జగన్

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నిర్ధేశిత సమయంలో ప్రజల నుండి వినతులను పరిష్కరించేందుకు గాను పర్యవేక్షించనున్నారు.

AP CM Ys Jagan orders to complete exams for fill vacanies in grama, ward secretarites
Author
Amaravathi, First Published Aug 10, 2020, 3:00 PM IST

అమరావతి:గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నిర్ధేశిత సమయంలో ప్రజల నుండి వినతులను పరిష్కరించేందుకు గాను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) కాల్ సెంటర్ ను సోమవారం నాడు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. 

ఎక్కడ దరఖాస్తు ఆగినా అప్రమత్తం పీఎంయూ అప్రమత్తం చేయనుంది. నిర్ధేశించుకొన్న సమయంలోపుగా వినతులు పరిష్కారం కానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం జగన్ ఇవాళ విడుదల చేశారు.

మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని సీఎం ప్రారంభించారు. ఫంక్షనల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులతో ఈ సచివాలయాలు అనుసంధానం చేయనున్నారు. 

ఇంటర్నెట్‌ లేని 512 సచివాలయాలను ఈ విధానం ద్వారా అనుసంధానం చేయనుంది ప్రభుత్వం.ఇందులో 213 సచివాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసినట్టుగా సీఎంకు అధికారులు తెలిపారు. మిగిలిన సచివాలయాలను వచ్చే 2 నెలల్లో అనుసంధానం చేయనున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను బోర్డుల ద్వారా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది.

వార్డు సచివాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో టాయిలెట్లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలని కూడ సీఎం తెలిపారు.

గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షల ప్రక్రియ ముగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల మీద గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు. సచివాలయాల్లోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం పెట్టుకున్నామన్నారు. అయితే ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించుకుని యాక్షన్‌ ప్లాన్‌కు సన్నద్ధం కావాలని సీఎం సూచించారు.నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏంటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికీ రావాలన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సెంటర్ల ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ల్యాండు రెవిన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్‌ ప్రకటించాలని సీఎం కోరారు. ఈ షెడ్యూల్ ను తనకు నివేదించాలని కోరారు. ఆ గ్రామానికి సంబంధించిన రికార్డులు అదే గ్రామంలో ఉంటే సమస్యలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios