ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ జరగడం లేదని ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మిగులు డోసులను ప్రభుత్వానికి పంపిణీ చేయాలని జగన్ కోరారు

ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ జరగడం లేదని ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మిగులు డోసులను ప్రభుత్వానికి పంపిణీ చేయాలని జగన్ కోరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌కు ప్రజలు ఆసక్తి చూపడం లేదని సీఎం అన్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా 2.67 లక్షల మందికే వ్యాక్సిన్ జరిగిందని జగన్ లేఖలో తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకొచ్చాయన్నారు. 

Also Read:దిశ యాప్‌ ఉంటే అన్న తోడున్నట్టే : జగన్‌

కేంద్రం పాలసీ ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించారని.. ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. మిగిలిపోయిన వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని ప్రధానికి జగన్‌ విజ్ఞప్తి చేశారు. జులై నెలలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారని.. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈనెల 24న జరిగిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు.