పశువులకు  మొబైల్ అంబులెన్స్ లను  ఏపీ ప్రభుత్వం  ప్రారంభించింది.  ఇవాళ  165 మొబైల్ అంబులెన్స్ లను  సీఎం జగన్  ప్రారంభించారు.  గతంలో  175 అంబులెన్స్ లను  ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.  


విజయవాడ: పశువులకు వైద్యం అందించే మొబైల్ అంబులెన్స్ లను ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు తాడేపల్లిలో ప్రారంభించారు. గతంలో తొలి విడతలో 175 అంబులెన్స్ లను సీఎం జగన్ ప్రారంభించారు. రెండో విడత కింద ఇవాళ 165 వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. మంత్రి సిదిరి అప్పలరాజుతో కలిసి జెండా ఊపి అంబులెన్స్ లను సీఎం జగన్ ప్రారంభించారు. అంబులెన్స్ ను సీఎం పరిశీలించారు. అంబులెన్స్ లో ఉన్న సదుపాయాల గురించి పశువైద్యాధికారులు సీఎం జగన్ కు వివరించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తొలివిడతలో పశువులకు మొబైల్ అంబులెన్స్ లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.129.07 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ ప్రారంభించిన 165 అంబులెన్స్ లకు రూ. 111 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. పశువులకు అవసరమైన మందులు, వైద్యం చేసేందుకు అవసరమైన పరికరాలు ఈ అంబులెన్స్ లో ఉంటాయి. తమ పశువులకు వైద్య సహయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 155251 నెంబర్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ పశువులకు వైద్యం చేసేందుకు ఆయా గ్రామాలకు వెళ్తాయి.ప్రతి అంబులెన్స్ లో పశు వైద్యుడు, సహా అతని సహాయకుడు ఉంటారు.