ఏలూరు: పోలవరం ప్రాజెక్టు పనులను సోమవారం నాడు పరిశీలించారు. ఇవాళ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం జగన్  పోలవరం చేరుకొన్నారు.

ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రులు ఆళ్లనాని, వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు స్వాగతం పలికారు.


పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనులను పురోగతిని సమీక్షించిన తర్వాత ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకొంటారు.

2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ  ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్  15 రోజుల్లో వస్తారని ఏపీ మంత్రులకు హామీ ఇచ్చారు.

గత వారంలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు కేంద్రమంత్రిని కలిసిన విషయం తెలిసిందే కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం జగన్ సోమవారం నాడు పరిశీలిస్తున్నారు.