కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 ముందు నియమించబడి ఇప్పటివరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులన్ని రెగ్యులర్ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. 

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐదేళ్ల నిబంధన తొలగించింది. 2014 జూన్ నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే నిర్ణయంలో మార్పు చేశారు. 2014 జూన్ 2 ముందు నియమించబడి ఇప్పటివరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులన్ని రెగ్యులర్ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. నాలుగు, ఐదు రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు.