ఏపీ సీఎం జగన్ కాలికి వాపు: మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స
ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు మణిపాల్ ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేయించుకొన్నారు. 45 నిమిషాల పాటు ఆయన హెల్త్ చెకప్ చేయించుకొన్నారు. ఆసుపత్రిలో చెకప్ తర్వాత సీఎం యధావిధిగా తన విధుల్లో పాల్గొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మణిపాల్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు హెల్త్ చెకప్ చేయించుకొన్నారు. 45 నిమిషాల పాటు సీఎం జగన్ హెల్త్ చెకప్ చేయించుకొన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఇటీవల వ్యాయామం చేస్తుండగా సీఎం జగన్ కాలికి గాయమైంది. అయితే మరోసారి కాలి గాయం వద్ద వాపు రావడంతో పరీక్షల కోసం సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లారు. సీఎం జగన్ కాలికి వైద్య పరీక్షలు చేశారు వైద్యులు.ఎమ్మారై స్కానింగ్ తో పాటు, జనరల్ చెకప్ చేయించుకున్న సీఎం జగన్ కాలు నొప్పితోనే జగన్ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ నొప్పి ఇటీవల మరీ ఎక్కువైంది. దీంతో ఆయన ఇవాళ ఉదయం ఆసుపత్రికి వెళ్లారు. అయితే సీఎం ys jagan కాలు నొప్పి తీవ్రంగా లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి రోజూ వ్యాయామం చేస్తారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణికింది. ఈ నొప్పి తిరగబెట్టడంతో ఆయన tratment కోసం తాడేపల్లిలోని manipal ఆస్పత్రికి ఆయన వెళ్లారు. సీఎంకు వైద్యులు ఎంఆర్‌ఐ స్కానింగ్‌తో పాటు ఇతర సాధారణ పరీక్షలు నిర్వహించారు. సుమారు 2 గంటలపాటు ఆస్పత్రిలోనే ఉన్న జగన్ అనంతరం తిరిగి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు.