వాళ్ల లాగా కామెంట్లు చేయడం మొదలుపెడితే ఒక్కసారి మేం డిసైడైతే వాళ్లు అసెంబ్లీలో కనిపించరని జగన్ హెచ్చరించారు. ఇది పర్చూరు కాదని.. సభలోకి రౌడీలను, గుండాలను తీసుకొచ్చారని జగన్ ఎద్దేవా చేశారు.

దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.... జగన్ ప్రసంగించినప్పుడల్లా మీరు మాకన్నా నెంబర్ తక్కువున్నారని పదే పదే అంటున్నారని, అంటే మేం భయపడాలా అని బాబు వ్యాఖ్యానించారు.

దీనికి కౌంటర్‌గా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంకా తాను ముఖ్యమంత్రిగానే ఉన్నాననే ఫీలవుతున్నారని .. ఆ భ్రాంతిలోనే మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. 40 ఏళ్ల అనుభవంలో సభా నియమాలు తెలియవని.. దానికి తోడు వెకిలి నవ్వు ఒకటంటూ సెటైర్లు వేశారు.

సున్నా వడ్డీ పథకం పూర్తిగా సున్నా అని... అక్షరాల రూ. 2,303 కోట్లు రూరల్ సెక్టార్‌లో బాకీ అని.. అర్బన్ సెక్టార్‌లో ఏప్రిల్ 2016 నుంచి సున్నా వడ్డీ పథకం లేదని.. రూ. 732 కోట్లు బాకీ అన్నారు.

ఇలాంటి పరిస్ధితుల్లో రైతులు, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం ఉన్నట్లా లేనట్లానని జగన్ ప్రశ్నించారు. 87,612 కోట్ల వ్యవసాయ రుణాల్లో రూ. 11 వేల కోట్లు చంద్రబాబు ఎగ్గొట్టారని జగన్ ఆరోపించారు.

ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని.. ఇదే మాదిరిగా వారు చేస్తే 23 మంది సభ్యులు కాస్తా.. 13కు పడిపోతారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. జనానికి ఏమాత్రం మంచి చేయాలనే ఆలోచన లేని వ్యక్తుల మధ్య సభలో ఉండటం బాధగా ఉందన్నారు.

సున్నా రుణాల మీద ఇంతకు మించి వివరణ ఇవ్వలేమని.. అయినప్పటికీ ప్రతిపక్షసభ్యులు చేతులు పైకెత్తుతున్నారని వాళ్ల చేతులు కత్తిరించాలని జగన్ వ్యాఖ్యానించారు.