Asianet News TeluguAsianet News Telugu

AP Floods : రేపు చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్.. స్వయంగా వరద బాధితులతో మాట్లాడనున్న సీఎం, షెడ్యూల్ ఇదే

వరదలు , భారీ వర్షాలతో (ap floods) అతలాకుతలమైన చిత్తూరు జిల్లాలో (chittoor district) రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు జిల్లాల్లోనే వుండనున్న సీఎం.. వరద నష్టాలు పరిశీలించి, బాధితుల సమస్యలు స్వయంగా తెలుసుకోనున్నారు . ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌కు పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది.  

ap cm ys jagan chittoor district visit on 2nd december
Author
Tirupati, First Published Dec 1, 2021, 9:54 AM IST

వరదలు , భారీ వర్షాలతో (ap floods) అతలాకుతలమైన చిత్తూరు జిల్లాలో (chittoor district) రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు జిల్లాల్లోనే వుండనున్న సీఎం.. వరద నష్టాలు పరిశీలించి, బాధితుల సమస్యలు స్వయంగా తెలుసుకోనున్నారు . ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌కు పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది.  

  • మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.40కు రోడ్డుమార్గాన బయలుదేరి 3.55 గంటలకు రేణిగుంట మండలంలోని వేదాలచెరువు ఎస్టీ కాలనీకి చేరుకుని కాలనీవాసులతో మాట్లాడతారు. 
  • 4.30కు బయలుదేరి 4.40 గంటలకు ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేటకు చేరుకుని వరద నష్టాలను పరిశీలిస్తారు.  
  • 4.55కు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు తిరుచానూరు–పాడిపేట క్రాస్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడతారు.  
  • 5.40 గంటలకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని 7 గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో వరదలపై సమీక్షిస్తారు. ఆరోజు అక్కడే బసచేస్తారు.  
  • 3వ తేదీ ఉదయం 8.30కు పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి 8.40 గంటలకు తిరుపతిలోని కృష్ణానగర్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడుతారు. – 
  • 9.25 గంటలకు బయలుదేరి ఆటోనగర్‌కు చేరుకుని బాధితుల సమస్యలు తెలుసుకుంటారు. 
  • 10.20 బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, 10.30కి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు పయనమవుతారు 


మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వదిలిపెట్టడం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్ళీ రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో heavy to extreme heavy rains కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.  భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.  గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. floods ముప్పు పొంచివున్న జిల్లాల అధికారులతో ఇప్పటికే cm ys jagan మాట్లాడి తగు సూచనలు చేసారు. 

ALso Read:పేదల తలరాతలు మార్చేందుకే: జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధుల విడుదల

ఇక ఇప్పటికే kadapa district కోడూరు, చిట్వేల్ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనుంపల్లి వద్ద వాగులు పొంగిపొర్లుతుండటంతో చిట్వేలి, రాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మలమడుగులో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాయచోటిలో ఉదయం నంచి భారీ వర్షం కురుస్తోంది. anantapur district లోని పుట్టపర్తి, తాడిపత్రిలోనూ వర్షతీవ్రత ఎక్కువగా వుంది. ప్రకాశం జిల్లా కంభం, బెస్తవారిపేట, అర్ధవీడులో వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో చిరుజల్లులు కురిసాయి.  నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతసాగరం ఎస్సీ కాలనీలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios