వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాశ్‌ను ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్

వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాశ్‌ను ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈరోజు ఈస్ట్ నియోజకవర్గ వైసీపీ నేతల సమావేశం సందర్భంగా జగన్ ఈ ప్రకటన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో అవినాశ్‌కి అందరూ సహకరించాలని జగన్ సూచించారు. ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎలాంటి విభేదాలున్నా పక్కనబెట్టాలని.. మనలో మనం సర్దుబాటు చేసుకుందామని జగన్ పేర్కొన్నారు. ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో వుంటామన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కాగా.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలపై జగన్ ఫోకస్ చేశారు. టార్గెట్ 175 దిశగా వ్యూహా రచన చేస్తున్న జగన్.. దీనిలో భాగంగా బుధవారం విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి టీడీపీయే గెలిచింది. దీంతో ఈసారి అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్.