కారణమిదీ:కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి ఏపీ సీఎం జగన్ లేఖ
బహ్రెయిన్‌లో ఉన్న ఏపీకి చెందిన కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కి సోమవారం నాడు లేఖ రాశారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలను అందించనున్నట్టుగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
అమరావతి: కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ కు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నాడు లేఖ రాశారు. బ్రహెయిన్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో వందలాది మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కూడ ఉన్నారని ఆ లేఖలో జగన్ గుర్తు చేశారు.
బహ్రెయిన్ లో ఇబ్బందులుపడుతున్నవారిని తిరిగి ఏపీకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను కోరారు. బహ్రెయిన్ లో ఉన్నవారిని రాష్ట్రానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు సీఎం జగన్.ఈ విషయమై అన్ని వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.