అమరావతి: వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు రూ.510 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.

పంట రుణాలు చెల్లిస్తే రైతులకు మొత్తం వడ్డీ తిరిగి వస్తోందన్న భరోసా కలుగుతోందన్నారు. 

పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామన్నారు. 14.58 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 510 కోట్లు జమ చేసినట్టుగా చెప్పారు.

అక్టోబర్ లో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ విడుదల చేశామన్నారు. నెల రోజుల్లోపే రూ. 132 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్ లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపామన్నారు సీఎం.

రైతులకు ఎంత చేసినా తక్కువేనని ఆయన చెప్పారు. 18 నెలల్లోనే 90 శాతానికి పైగా హామీలను నెరవేర్చామన్నారు.ఎన్నికల హామీలను సుమారు 90 శాతం పూర్తి చేశామని ఆయన చెప్పారు. 

రైతు భరోసా కింద రూ. 13,500 రూపాయాలు చెల్లిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామన్నారు.రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పగటిపూట ఉచితంగా  రైతులకు 9 గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.