ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఏపీకి కేంద్రం నుంచి పరిమితంగా వ్యాక్సిన్లు వస్తుండటంతో వాటిని పెంచాలంటూ లేఖలో జగన్ కోరారు. ఈ నెల 1వ తేదీ నుంచి 18 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య‌వారికి వ్య‌క్సినేష‌న్ చేప‌ట్టాల్సి ఉన్నా.. వ్యాక్సిన్ నిండుకోవ‌డంతో.. చాలా రాష్ట్రాలు వెనుక‌డుగు వేశాయి..

కొన్ని రాష్ట్రాల్లో ముందుకు వ‌చ్చినా.. అదికూడా ప‌రిమితంగా కొన్ని జిల్లాల్లో మాత్ర‌మే ఇస్తున్నాయి.. అయితే, ఇవాళ సీఎం వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో.. 45 ఏళ్లు పైబ‌డిన‌వారికే వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది..

Also Read:ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ: కర్ఫ్యూకి ఆమోదముద్ర... కీలక నిర్ణయాలు

ఇక‌, వాక్సినేషన్ల‌పై ప్రధాని న‌రేంద్ర‌ మోడీకి లేఖ రాయాలని నిర్ణ‌యించింది కేబినెట్. దీనిలో భాగంగానే జగన్ .. ప్రధానికి లేఖ రాశారు. ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ చక్కగా సాగుతోందని.. కరోనా నివారణకు కేంద్రం సూచించిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందని జగన్ అన్నారు. కరోనా కట్టడిలో కేంద్రానికి అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం లేఖలో పేర్కొన్నారు