రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల గారాలపట్టి ఈషా అంబానీ, ఆనంద్ పిరమాల్‌ వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ నెల 12న ముంబై జరిగే తమ కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా ముఖేశ్ అంబానీ నుంచి చంద్రబాబుకి ప్రత్యేక ఆహ్వానం అందింది.

దీంతో ఈ వేడుకకి హాజరుకావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా సీఎంవో వర్గాలు తెలిపాయి. అంబానీ కుటుంబంతో చంద్రబాబుకి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. రిలయన్స్ వ్యవస్ధాపకుడు ధీరుభాయ్ అంబానీతో పాటు ఆయన కుమారులు ముఖేశ్, అనిల్‌ అంబానీలకు ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ముఖేశ్ అమరావతికి వచ్చినప్పుడు సీఎం ఆయనను రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు తీసుకెళ్లి పనితీరును వివరించడంతో పాటు తన నివాసంలో విందు ఇచ్చారు. 

ఈషా అంబానీ పెళ్లికి ట్రంప్ దంపతులు..?