అమరావతి: భారత ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న చంద్రబాబు నాయుడు 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ వేదికగా మోదీ వ్యాఖ్యలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. 

తాను తల్చుకుంటే మమత ప్రభుత్వాన్ని కూల్చగలనంటూ మోదీ అనడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఈసీ స్పందించాలని డిమాండ్ చేశారు. మోదీపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. 

రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసిన మోదీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్య అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.