Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై కేసు నమోదు చేసిన ఏపీ సీబీ సీఐడీ..

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు‌పై (Ashok Babu) కేసు నమోదైంది. సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఏపీ సీబీ సీఐడీ (AP CB-CID) అధికారులు ఈ కేసు నమోదు చేశారు.

AP CID Files case Against TDP MLC Ashok babu
Author
Amaravati, First Published Jan 25, 2022, 1:34 PM IST

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు‌పై (Ashok Babu) కేసు నమోదైంది. సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఏపీ సీబీ సీఐడీ (AP CB-CID) అధికారులు ఈ కేసు నమోదు చేశారు. అశోక్ బాబు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా పనిచేసిన సమయంలో తన సర్వీస్ రికార్డులో విద్యార్హతలను తప్పుగా పేర్కొన్నందుకు ఆయనపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఆయనపై 477A, 465 (ఫోర్జరీ), 420 (చీటింగ్) సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు. 

అశోక్‌బాబు.. ఏసీటీవోగా ఉన్నప్పుడు ఫోర్జరీ సమాచారం ఇచ్చారని కేసు నమోదు నమోదైంది. బీకాం చదవకుండానే ఆయన నకిలీ సర్టిఫికెట్లు పెట్టారని అభియోగం మోపారు. కేసు పెండింగ్‌లో ఉండగా ఎలాంటి కేసులు లేవని అశోక్ బాబు ఆఫిడవిట్‌లో తెలిపారు.

రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలపై అశోక్‌బాబు సర్వీసు రికార్డుపై సీబీ సీఐడీ విచారణకు ఆదేశించాలని లోకాయుక్త గతేడాది ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అశోక్ బాబు.. సర్వీస్‌ రికార్డులో బీకాం గ్రాడ్యుయేట్‌గా చూపించారని ఏపీ కమర్షియల్‌ టాక్సెస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బి.మెహర్‌ కుమార్‌ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన లోకాయుక్త ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్‌ రికార్డులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది, అధికారులు అశోక్‌బాబు విద్యార్హతలపై తప్పుడు సమాచారం నమోదు చేసి అవకతవకలకు పాల్పడ్డారని మోహర్ కుమార్ తెలిపారు.

ఇక, అశోక్ బాబు ఎపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios