అమరావతిలో రథోత్సవం: రాజధాని ప్రజల ఆందోళన, రైతును ఢీకొన్న వైసీపీ ఎంపీ కారు

రాజధాని తరలింపు, మూడు రాజధానుల తరలింపు నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అమరేశ్వర స్వామి రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

ap capital farmers protest at rathotsavam in amaravathi

రాజధాని తరలింపు, మూడు రాజధానుల తరలింపు నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అమరేశ్వర స్వామి రథోత్సవం జరిగింది.

Also Read:రోజాకు అమరావతి సెగ: వాహనం ముందు బైఠాయించిన మహిళలు, రైతులు

ఈ కార్యక్రమానికి మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అదే సమయంలో రాజధాని గ్రామాల రైతులు తరలివచ్చి జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. మంత్రి మోపిదేవి దగ్గరకు వెళ్లి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు.

Also Read:అచ్చెన్నాయుడు, గణేష్ లను టార్గెట్ చేసింది అందుకే..: వైసిపిపై చంద్రబాబు ఆగ్రహం

సరిగ్గా ఇదే సమయంలో నిరసన తెలుపుతున్న రైతుల వైపుగా బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ కారు వెళ్లింది. అక్కడే ఉన్న తుళ్లూరుకు చెందిన తాడికొండ హనుమంతరావు అనే రైతును ఎంపీ వాహనం ఢీకొట్టడంతో ఆయన కిండపడిపోయాడు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన రైతును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నందిగం సురేశ్ కారులోనే ఉన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios