రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణతో జలవివాదాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే రేపు రాయలసీమ ఎత్తిపోతలను కృష్ణా రివర్ బోర్డ్ సందర్శించనుంది. ఈ తరుణంలో కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది
రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణతో జలవివాదాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే రేపు రాయలసీమ ఎత్తిపోతలను కృష్ణా రివర్ బోర్డ్ సందర్శించనుంది. ఈ తరుణంలో కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. జాబ్ క్యాలండర్‌పైనా చర్చించే అవకాశం వుంది. వీటితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలు, లాప్‌టాప్‌లు పంపిణీ, భూసేకరణ చట్టంపై కేబినెట్ చర్చించనుంది. కొత్త ఐటీ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుంది. పేదల ఇళ్ల స్థలాలు క్రమబద్దీకరణ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

