ప్రారంభమైన ఏపీ కేబినెట్: కీలకాంశాలపై చర్చ

ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. కీలకాంశాలపై ఈ కేబినెట్ చర్చించనుంది. ఆక్వా రంగంతో పాటు విద్యాశాఖతో, పోలవరం బాధితులకు పరిహారం చెల్లింపు వంటి అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది.

AP Cabinet meeting begins lns

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు అమరావతిలో ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది.
నూతన సీడ్ పాలసీ, నేతన్న నేస్తం అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. నాడు-నేడు రెండో దశ పనులకు కూడ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆక్వా రైతులకు లాభం కలిగేలా ఫిష్ మార్కెటింగ్ పాలసీకి కూడ రూపకల్పన చేయనున్నారు.

జగనన్న విద్యా కానుక, శాటిలైట్ పౌండేషన్ స్కూళ్లు, పౌండేషన్ ప్లస్ స్కూళ్లపై చర్చించనున్నారు.  ఈ నెల 10 వ తేదీన వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ  పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులను కేబినెట్ ఆమోదించనుంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుల, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న  జల వివాదంపై కూడ చర్చించే అవకాశం ఉంది.ఈ విషయమై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై  త్వరలోనే విచారణ జరగనుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios