ఏపీ కేబినెట్ భేటీ: కొత్త పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్, కీలకాంశాలకు ఆమోదం
14 ఆర్డినెన్స్ లకు సంబంధించి ఆమోదించనున్నా ఈ ఏడాది జూలై నుండి పలు శాఖలకు సంబంధించిన ఆర్డినెన్స్ లను సభ ముందు పెట్టనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలపై కేబినెట్ ముగిసిన తర్వాత జగన్ మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశమైంది.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది జూలై నుండి ఇప్పటివరకు 14 ఆర్డినెన్స్ లను తీసుకొచ్చింది. అసెంబ్లీలో ఈ ఆర్డినెన్స్ లు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తప్పనిసరి. దీంతో ఈ 14 ఆర్డినెన్స్ లకు Ap Cabinet ఇవాళ ఆమోదం తెలపనుంది. పలు శాఖలకు చెందిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం 14 ఆర్డినెన్స్ లను తీసుకొచ్చింది.
ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చట్ట సవరణ, ప్రైవేట్ యూనివర్శిటీలకు సంబంధించి చట్ట సవరణ, విద్యా చట్టానికి సంబంధించి చట్ట సవరణపై ఆర్డినెన్స్ ను , అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించి, సినిమా విభాగానికి సంబంధించి ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ పై చట్ట సవరణ, పంచాయితీరాజ్ శాఖకు సంబంధించి చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్స్ చేసింది.
also read:అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం: టీడీఎల్పీ కీలక నిర్ణయం
మరో వైపు ఇవాళ ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలపై కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ఏపీ సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని సమాచారం.ఇవాళ ఏపీ అసెంబ్లీలో Chandrababu భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. అయితే మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకు ముందు అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఎం వైఎస్ ys jagan కౌంటరిచ్చారు. చంద్రబాబు చెబుతున్నట్టుగా వ్యక్తిగత వ్యాఖ్యలు వైసీపీ సభ్యులు చేయలేదన్నారు.
కేబినెట్‌లో ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకూ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో శాసన సభలో ప్రవేశ పెట్టాల్సిన ముసాయిదా బిల్లులపై మంత్రి వర్గం చర్చించింది. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 29న విద్యాదీవెన కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లుకు కేబినెట్ ఆమోదించింది.
ఎస్‌పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన కొత్త పరిశ్రమలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు 4 షెడ్ల కేటాయింపుతో పాటు ఇన్సెంటివ్‌లకు కేబినెట్ ఆమోదం. డిక్సన్ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌కు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955 సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్-1955 చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం. ఏపీ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం. ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో 16 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్-1994లో సవరణలకు కేబినెట్ ఆమోదించింది.