కొనసాగుతున్నఏపీ కేబినెట్ సమావేశం: కీలకాంశాలపై చర్చ
ఏపీ కేబినెట్ 40 కీలక అంశాలపై చర్చిస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ వైఎస్ జగన్ అధ్యక్షతన ప్రారంభమైంది. 40 కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం గురువారం నాడు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. పలు కీలక అంశాలపై చర్చిస్తోంది కేబినెట్.ఆర్గానిక్ ఫామ్ సంస్థలే ఉత్పత్తులను విక్రయించేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు వీలుగా ఫార్మింగ్ సర్టిఫికేషన్ అధారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఆసరా రెండో విడత నిధుల మంజూరుతో పాటు ఆసుపత్రులు, స్కూల్స్ కు సహాయం చేసిన వారి పేర్లు పెట్టే విషయమై చర్చిస్తున్నారు.విశాఖ మన్యంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గృహ నిర్మాణానికి రూ. 35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.హౌసింగ్ కార్పోరేషన్ రుణాల వన్ టైం సెటిల్ మెంట్ పథకంపై కూడ కేబినెట్ చర్చిస్తోంది.కొత్తగా బద్వేల్ రెవిన్యూ డివిజన్ ఏర్పాటు సహా మత్తం 40 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎల్జీ పాలీమర్స్ భూములను వెనక్కి తీసుకొనే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.