Asianet News TeluguAsianet News Telugu

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం: 49 అంశాలపై చర్చ

ఏపీ కేబినెట్ సమావేశం  బుధవారంనాడు ఏపీ సచివాలయంలో ప్రారంభమైంది.ఈ సమావేశంలో  పలు కీలక అంశాలపై  కేబినెట్ చర్చిస్తుంది.

AP Cabinet meeting  begins  at AP Secretariat in Amaravathi lns
Author
First Published Sep 20, 2023, 12:26 PM IST

అమరావతి: ఏపీ కేబినెట్ భేటీ బుధవారంనాడు ఏపీ సచివాలయంలో ప్రారంభమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన  కేబినెట్ భేటీ ప్రారంభైంది.  కేబినెట్ ఎజెండాలోని  49 అంశాలపై చర్చిస్తున్నారు. రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  అసెంబ్లీ సమావేశాల్లో  ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఐబి బోర్డ్ , విద్యాశాఖ   ఎంవోయు చేసుకొనేందుకు ఆమోదం తెలుపనుంది కేబినెట్.జిపిఎస్ కు ఆమోదం, కాంట్రాంక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్, అసైండ్ భూముల రెగ్యులైజేషన్ బిల్లులకు ఆమోదం కేబినెట్ ఆమోదం తెలపనుంది.

ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుపై చర్చ జరగనుంది.ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లుపై కూడ కేబినెట్ చర్చించనుంది.పోలవరం ముంపు బాధితులకు  8 వేల ఇళ్ల నిర్మాణానికి  కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.  దేవాదాయ చట్టసవరణపై కేబినెట్ చర్చించనుంది.  

అసైన్డ్  భూముల క్రమబద్దీకరణ, పీఓటీ చట్టసవరణకు ఆమోదం తెలపనుంది కేబినెట్.కురుపాం  ఇంజనీరింగ్ కాలేజీల్లో  50 శాతం సీట్లు గిరిజనులకే కేటాయించే విషయమై  కేబినెట్  చర్చించే అవకాశం ఉంది.కేబినెట్ అజెండా అంశాలు ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం లేకపోలేదు.  రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో  అనుసరించే వ్యూహంతో పాటు  చంద్రబాబు అరెస్ట్ పై  అధికారులు వెళ్లిపోయిన తర్వాత కేబినెట్ లో చర్చించే అవకాశం లేకపోలేదు.జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి  ప్రోత్సాహకాలు అందించనుంది ప్రభుత్వం.జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి  ప్రోత్సాహకాలు అందించనుంది ప్రభుత్వం.

Follow Us:
Download App:
  • android
  • ios