Asianet News TeluguAsianet News Telugu

మండలి ముందుకు మరికాసేపట్లోమూడు రాజధానుల బిల్లు, ఇరు పార్టీల వ్యూహాలు ఇవీ...

అసెంబ్లీలో నిన్న ఆమోదం పొందిన సీఆర్డీఏ రద్దు బిల్లు, పాలనావికేంద్రీకరణ బిల్లు నేడు మండలి ముందుకు రానున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ బిల్లులను మండలిలో ఎలా అడ్డుకుంటామో చూడండి అంటూ సవాల్ విసిరారు. 

 

AP Budget Session2020: AP 3 Capitals Bill To Be tabled In Council Today
Author
Amaravathi, First Published Jun 17, 2020, 10:07 AM IST

అసెంబ్లీలో నిన్న ఆమోదం పొందిన సీఆర్డీఏ రద్దు బిల్లు, పాలనావికేంద్రీకరణ బిల్లు నేడు మండలి ముందుకు రానున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ బిల్లులను మండలిలో ఎలా అడ్డుకుంటామో చూడండి అంటూ సవాల్ విసిరారు. 

మండలిలో ప్రతిపక్షానిదే బలం. మండలి టీడీపీ విప్ బుద్ధ వెంకన్న ఇప్పటికే  తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికై వైసీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీలు సీహెచ్ శివనాధరెడ్డి, పోతుల సునీత, పి.శమంతకమణికి విప్ జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు. బుధవారం మండలిలో జరిగే ఓటింగ్ కు హాజరై పార్టీ తరపున ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది.

ఇకపోతే మండలిలో బలాబలాలను గనుక పరిశీలిస్తే.... టీడీపీకి 28 మంది సభ్యులు ఉన్నారు. పిడిఎఫ్ కి 5 సభ్యులు ఉండగా, బీజేపీకి ముగ్గురు సభ్యులు, నలుగురు స్వతంత్రులు, 6ఖాళీలు ఉన్నాయి. అధికార వైసీపీకి 12 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకో 12 నుంచి 13 మందిని వైసీపీ దువ్వుతున్నట్టుగా తెలుస్తుంది. కె ప్రభాకర్ వంటి వారు నేడు వైసీపీకి మద్దతిచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఇక నేడు ఈ బిల్లును ఎలాగైనా అడ్డుకొని మరోసారిసెలెక్ట్ కమిటీకి పంపుతామని అంటున్నారు. నిన్న సభలో రెండు బిల్లులను ప్రభుత్వం తిరిగి ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. అయితే బిల్లులు అసెంబ్లీలో రిఇంట్రడ్యూస్ పెట్టడం నిబంధనలకు విరుద్ధమని... కోర్టులో ఈ అంశంలో విచారణ జరుగుతుందని టీడీపీ తెలిపింది. 

సెలక్ట్ కమిటీ విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉందని టీడీపీ పేర్కొంది. మండలిలో బిల్లులను అడ్డుకునేందుకు సిద్ధమైన ప్రతిపక్షం..తగు ఏర్పాట్లలో ఉంది. అయితే సర్కార్ మాత్రం నిబంధనలకు అనుసరించే బిల్లును ప్రవేశపెట్టామని అంటుంది. 

సెలెక్ట్ కమిటి ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఏపీ హైకోర్టులో ఇటీవలనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఈ బిల్లులను అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తెలపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ రెండు బిల్లులను ప్రభుత్వం  అసెంబ్లీలో జనవరి మాసంలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది. ఒక్కరోజు సుధీర్ఘ చర్చించిన తర్వాత జనవరి 20న ఈ బిల్లులను వాయిస్ ఓటుతో అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఆ తర్వాత ఈ బిల్లులను శాసనమండలి ముందుకు తీసుకెళ్లారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని కోరారు.  అయితే సెలెక్ట్ కమిటి ఇంతవరకు ఏర్పాటు కాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios