Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య విషయంలో...టిటిడి, ఎస్వీబిసి ఎందుకిలా చేసాయి?: విష్ణువర్థన్ ఆగ్రహం

కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన టిటిడికి చెందిన ఎస్వీబీసీ ఛానల్, బాధ్యుల మీద చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

ap bjp vice president vishnuvardhan reddy angry on ttd and svbc channel
Author
Tirumala, First Published Aug 6, 2020, 1:11 PM IST

విజయవాడ: కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన టిటిడికి చెందిన ఎస్వీబీసీ ఛానల్, బాధ్యుల మీద చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా అయోధ్య రామమందిరానికి భూమీ పూజ చేస్తే ప్రసారాలను తిరుమల భక్తి ఛానల్ లో ఎందుకు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు. 

''వివిఐపిలు, రాజకీయ నాయకుల తిరుమల దర్శనం మాత్రం ముందు వరుసలో కనపడుతాయి. కానీ ప్రపంచంలో 250 టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారాన్ని గంటలపాటు ఇస్తే టిటిడి ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి జగన్ విశాఖ శారదాపీఠానికి వెళ్లినా ఎస్వీబిసి ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుందని...అలాంటిద అయోద్య  ప్రసారాలు ఎందుకు చేయలేదు?'' అని నిలదీశారు. 

''హిందూ ధర్మ ప్రచారం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేయాలని మూల సిద్ధాంతాన్ని,  దేవుడి ఆశయాన్ని నీరుగారుస్తున్నారు. ఎస్వీబీసీ అసలు ఉద్దేశం ధర్మ ప్రచారం కోసమే... అందులో హిందూ ధర్మ ప్రచారం కోసమే అని టిటిడికి గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఆయోధ్యలో జరిగిన భూమిపూజను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్విబిసి సిఇఓ వెంకట నాగేష్ ను తక్షణం విధుల నుంచి తొలగించాలి. ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డి వెంటనే  దీనిపై విచారణ చేపట్టి 24 గంటలలో  బాధ్యులపై  చర్యలు తీసుకోవాలి'' అని డిమాండ్ చేశారు. 

''రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తక్షణమే దీనిపై స్పందించాలని రాష్ట్ర బిజెపి డిమాండ్ చేస్తోంది'' అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios