ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అవమానం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు రానుండటంతో ఆయన కీలక నేతలతో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

అయితే అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు భద్రతా కారణాల రీత్యా ఆయనను అడ్డుకున్నారు. దీంతో కన్నా, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రధానితో పాటు తాను హెలికాఫ్టర్‌లో గుంటూరు వెళ్లాల్సి ఉందని చెప్పగా, ఆ లిస్టులో పేరు లేదని పోలీసులు చెప్పారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.