Asianet News TeluguAsianet News Telugu

వ్యాపారాలు, కార్యాలయాలు తెరుచుకోవచ్చు.. వినాయక చవితి చేసుకోకూడదా: సోము వీర్రాజు

వ్యాపార, విద్యాసంస్థలు కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నప్పుడు వినాయకచవితి వేడుకలకు ఎందుకు అనుమతి ఇవ్వరని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రశ్నించారు. ఓవైపు కరోనా అదుపులో ఉందంటూనే వినాయకచవితి జరుపుకోకుండా ప్రజలపై ఆంక్షలా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ap bjp chief somu veerraju asks ap govt to give permission for vinayaka chavithi
Author
Amaravathi, First Published Sep 3, 2021, 7:13 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి దృష్ట్యా వినాయకచవితి వేడుకలను ప్రజలు ఇళ్లకే పరిమితం చేసుకోవాలని, బహిరంగ వేడుకలు వద్దని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. వినాయకచవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

ప్రస్తుతం అన్నిరకాల వ్యాపార, విద్యాసంస్థలు కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నప్పుడు వినాయకచవితి వేడుకలకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఓవైపు కరోనా అదుపులో ఉందంటూనే వినాయకచవితి జరుపుకోకుండా ప్రజలపై ఆంక్షలా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వినాయకచవితి అంశంపై ఏపీ సర్కారు పునరాలోచన చేయాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ALso Read:స్థిరంగా కరోనా కేసులు: ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు.. వినాయక చవితి వేడుకలపైనా సూచనలు

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా వున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్లు  తెలిపింది. అలాగే వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో గణపతి విగ్రహాలను పెట్టొద్దని వైద్యాధికారులు సిఫారసు చేశారు. అలాగే నిమజ్జన ఊరేగింపులు కూడా వద్దని వైద్యాధికారులు స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios